Urea Crisis: యూరియా కొరత అధిగమించేందుకు సర్కార్ చర్యలు..!
ABN , Publish Date - Aug 23 , 2025 | 10:21 AM
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇక్కట్లను తీర్చేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరా గురించి నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా యూరియా సమస్య హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడంలేదని అధికార పార్టీ ఆరోపిస్తుంటే.. మరో పక్క రాష్ట్ర బీజేపీ నేతలు అలాంటిదేమీ లేదని కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగారు.యూరియాను ఎప్పటికప్పుడు సరఫరా కేంద్రాలకు తరలించేలా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో లారీ అసోసియేషన్స్ మధ్య ఏర్పడిన పోటీతో యూరియా రవాణా నిలిచిపోవడంతో.. ట్రాన్స్‌పోర్ట్ సమస్యను స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తున్నారు మంత్రి తుమ్మల. రామగుండం యూరియా ఫ్యాక్టరీతోనూ మంత్రి నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. శనివారం రామగుండం ఫ్యాక్టరీ ఎండీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలవనున్నారు. కాగా, సాంకేతిక సమస్య కారణంగా రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఉత్పత్తి ప్రారంభం అయితే యూరియా సమస్య కొంతైనా తీరే అవకాశం ఉందని సర్కార్ భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులంతా ఒక్కటే.. ఉమెన్ పదం అవసరం లేదు
Read Latest Telangana News and National News