YCP EX MLA Missing: కావలి ఎమ్మెల్యే కావ్యా హత్య కుట్రలో ట్విస్ట్.. ఏ5గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే..
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:34 AM
కొన్ని రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు.
నెల్లూరు: కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి హత్యకి కుట్ర, హత్యాయత్నం కేసులో A5 నిందితుడిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు పోలీసులు. గత నాలుగు రోజులుగా పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న రామిరెడ్డి, మరో ఇద్దరు రౌడీషీటర్ల కోసం మూడు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. బెంగుళూరులో రామిరెడ్డి, అతడి అనుచరులు పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి వారంతా మైసూరుకు మకాం మార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. రామిరెడ్డి దేశం విడిచి వెళ్లకుండా శనివారం లుక్ అవుట్ నోటీసులు ఇచ్చే అవకాశముంది. కాగా, రామిరెడ్డిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల లిక్కర్ స్కాంలోనూ రామిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు.
కొన్ని రోజుల క్రితం జలదంకి మండలం అన్నవరంలోని తన క్రషర్ వద్ద ఉన్న కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డిపై వైసీపీ మూకలు దాడికి యత్నించాయి. డ్రోన్‌తో వీజువల్స్ తీస్తుండగా ప్రశ్నించిన సిబ్బందిపై మారణాయుధాలతో దాడి చేయడంతో క్రషర్ సిబ్బంది పోలీసులకు పట్టించారు. పట్టుబడిన నిందితులు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆదేశాలతో వచ్చామని అంగీకరించినట్లు సమాచారం. పలువురు వైసీపీ నేతల నుంచి కూడా నిందితుల ఫోన్లకు కాల్స్ వచ్చాయని పోలీసులు చెప్తున్నారు. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను చంద్రబాబును కలవడానికి విజయవాడ వెళ్లడంతో దాడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని, జగన్ ఆదేశాలతోనే రామిరెడ్డి ఈ దాడికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తనను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలన్న కుట్రను సీఎం చంద్రబాబుకు వివరించానని అన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, మరో ఇద్దరు రౌడీషీటర్లను పట్టుకునేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా వెతుకులాట కొనసాగిస్తున్నాయి.
ఇవీ చదవండి..
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ వైద్యుడు
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..