Vinayaka Chavithi: మట్టి గణపతులపై మనసేది..
ABN , Publish Date - Aug 23 , 2025 | 10:11 AM
పర్యావరణంతో పాటు భూగర్భ జలాశాయాలను కలుషితం చేసే ప్లాస్టర్ ఆఫ్ పారి్‌స(పీవోపీ) గణేశ్ విగ్రహాలను వాడొద్దని, వినాయక చవితి సందర్భంగా వాడవాడలా పర్యావరణ హిత మట్టి గణపతినే వాడాలని ఉన్నత న్యాయ స్థానాలు, పలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి
- మార్కెట్‌లో అడుగడుగునా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు
హైదరాబాద్: పర్యావరణంతో పాటు భూగర్భ జలాశాయాలను కలుషితం చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) గణేశ్ విగ్రహాలను వాడొద్దని, వినాయక చవితి(Vinayaka Chavithi) సందర్భంగా వాడవాడలా పర్యావరణ హిత మట్టి గణపతినే వాడాలని ఉన్నత న్యాయ స్థానాలు, పలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు.
వాటిలో ఎక్కువగా పీవోపీ విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహించడానికి అల్వాల్ సర్కిల్ పరిధిలోని యువజన సంఘాలు, అపార్ట్‌మెంట్, కాలనీ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. గతంలో పండగకు 10 రోజుల మందే జీహెచ్‌ఎంసీ అధికారుల ఆఽధ్వర్యంలో మట్టి గణేశ్‌ల వాడకంపై ప్రచార కార్యక్రమాలను చేపట్టేవారు. ఇప్పుడు ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏ సర్కిల్ పరిధిలో కూడా పెద్దగా కనిపించకపోవడం గమనార్హం.

పీసీబీకి బాధ్యత లేదా?
పర్యావరణ పరిరక్షణపైన ప్రచారం చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు ఈ దిశగా చొరువ చూపడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మట్టి గణపతులను వాడకంపై గతంలో కరపత్రాలతో పీసీబీ అధికారులు ప్రచారం చేసి పీవోపీ వాడకం ద్వారా నీటి వనరులు ఏవిధంగా కలుషితం అవుతాయో వివరించేవారు. ప్రస్తుతం ఎక్కడా కూడా ఈవిధంగా ప్రజలను చైతన్యం పరుస్తున్న దాఖాలాలు కనిపించడంలేదు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు అల్వాల్‌లోని కొత్తచెరువు, చినరాయుని చెరువు, హస్మత్‌పేట్ చెరువులు నిండు కుండల్లా మారియి. ప్రస్తుతం పెద్ద ఎత్తున పీసీబీ తయారు చేసిన గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. కొన్ని చెరువుల వద్ద కొలనులు లేకపోవడంతో వారంతా చెరువుల్లోనే నిమజ్జనం చేస్తారు. దీంతో భూగర్భ జలాశయాలు కలుషితం కావడమే కాకుండా చెరువుల్లో ఉండే జలాచరాలు చనిపోయే ప్రమాదం ఉంది.
మట్టి గణపతులనే పూజించండి
పర్యావరణానికి హాని కలిగించే రంగుల వినాయకులకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి గణపతులనే పూజించాలన్నది జీహెచ్‌ఎంసీ నినాదం. వార్డుల వారీగా ఉచితంగా గణపతులను అందజేస్తున్నాం. అల్వాల్ సర్కిల్ పరిధిలో మట్టి విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.
- శ్రీనివాసరెడ్డి, అల్వాల్ సర్కిల్
డిప్యూటీ కమిషనర్
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News