Bhatti Vikramarka: పోలీసులంతా ఒక్కటే.. ఉమెన్ పదం అవసరం లేదు
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:27 AM
ఉమెన్ పోలీసులో ఉమెన్ అన్న పదాన్ని వాడకుండా ఉండాలనే ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పురుషులతో సమానంగా విధులు నిర్వహస్తున్న మహిళలకు తగిన అవకాశాలతో పాటు వారి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముందన్నారు.
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ సిటీ: ఉమెన్ పోలీసులో ఉమెన్ అన్న పదాన్ని వాడకుండా ఉండాలనే ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు. పురుషులతో సమానంగా విధులు నిర్వహస్తున్న మహిళలకు తగిన అవకాశాలతో పాటు వారి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముందన్నారు. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి (ఆర్‌బీవీఆర్‌ఆర్) తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన మూడు రోజుల మొదటి మహిళా పోలీసు అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అంకిత భావంతో పనిచేసే సీఎం, కేబినెట్ అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంచేందుకు అంకిత భావంతో కృషి చేస్తున్న పోలీసుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. తెలంగాణలో తీసుకువచ్చిన నూతన యంగ్ ఇండియా స్కూల్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా పోలీసుల పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

మూడు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో తీసుకున్న లింగ సమానత్వం, రివార్డ్స్, డ్రస్ కోడ్, సెలవులు వంటి అంశాలపై సానుకూలంగా స్పందించారు. డీజీపీ డాక్టర్ జితేందర్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ, టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్ తదితరులు మాట్లాడారు. కానిస్టేబుల్ నుంచి డీజీ స్థాయి వరకు 408 మంది మహిళా సిబ్బంది పాల్గొని తమ గళాన్ని వినిపించారన్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా, అడితషనల్ డీజీ బాలనాగదేవి, స్వాతి లక్రా తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News