Hyderabad: 27 వారాల శిశువుకు అపోలోలో అరుదైన వైద్యం
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:50 AM
నెలలు నిండని, అనేక ఆరోగ్య సమస్యలతో జన్మించిన ఓ శిశువుకు అపోలో క్రెడిల్ ఆస్పత్రి అరుదైన వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. నగరానికి చెందిన ఓ దంపతులకు 27 వారాలకే జన్మించిన శిశువు పుట్టిన సమయంలో 504 గ్రాముల బరువు మాత్రమే ఉండింది.
- 61 రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స
హైదరాబాద్ సిటీ: నెలలు నిండని, అనేక ఆరోగ్య సమస్యలతో జన్మించిన ఓ శిశువుకు అపోలో క్రెడిల్ ఆస్పత్రి(Apollo Cradle Hospital) అరుదైన వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. నగరానికి చెందిన ఓ దంపతులకు 27 వారాలకే జన్మించిన శిశువు పుట్టిన సమయంలో 504 గ్రాముల బరువు మాత్రమే ఉండింది.
అనేక ఆరోగ్య సమస్యలతో జన్మించిన శిశువును ఎన్‌ఐసీయూలో 61 రోజులు ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందించినట్లు వైద్యులు వివరించారు. వెంటిలేటర్‌పై ఉంచి ఇన్‌ఫెక్షన్స్, జాండీస్, అప్నియా వంటి చికిత్స అందించినట్లు నియోనాటాలజిస్ట్ డాక్టర్ రాజసుబ్బారెడ్డి(Dr. Rajasubba Reddy) చెప్పారు. చికిత్స తర్వాత ప్రస్తుతం శిశువు 1,568 కిలోల బరువు పెరిగిందన్నారు.

నోటిద్వారా ఆహారం తీసుకునే స్థాయికి చేరుకుందన్నారు. అనంతరం డిశ్చార్జీ చేసినట్లు చెప్పారు. నవజాత శిశువులను సంరక్షించడం చాలా నైపుణ్యతతో కూడిన అంశమని నియోనాటాలజిస్టు, పీడియాట్రిషియన్ డాక్టర్ కృష్ణ స్వరూ్‌పరెడ్డి చెప్పారు. ఎన్‌ఐసీయూ బృందంలో డాక్టర్ శివకుమార్‌రెడ్డి ఉన్నారు. ప్రసూతి, గైనకాలజీ బృందంలో డాక్టర్ విమీ బింద్రా, డాక్టర్ అర్చనారెడ్డి, డాక్టర్ శ్వేతా ఉన్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News