Share News

Maheshwaram Bhoodan: మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారంపై హైకోర్టు కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 17 , 2025 | 08:47 PM

మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారం పై తెలంగాణ హైకోర్టు తీర్పు కీలక తీర్పు ఇచ్చింది. ల్యాండ్ ను కొనుగోలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సర్వే నెంబర్ 194, 195 భూదాన్ భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసి అన్యాక్రాంతం చేశారంటూ పిటిషనర్ తరఫున లాయర్ హైకోర్టు వాదించారు.

Maheshwaram Bhoodan: మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారంపై హైకోర్టు కీలక నిర్ణయం
Bhoodan land controversy

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారం పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ ను కొనుగోలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సర్వే నెంబర్ 194, 195 భూదాన్ భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసి అన్యాక్రాంతం చేశారంటూ పిటిషనర్ తరఫున లాయర్ హైకోర్టు వాదించారు. అయితే పిటిషనర్ వాదనలను ధర్మాసనం ఏకిభవించలేదు. ఈ కేసులో ఇంప్లిడ్ పిటిషన్లు , ఇంటర్‌లోక్యుటరీ అప్లికేషన్(IA) పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టి వేసింది. మరోవైపు భూదాన్ భూముల వ్యవహారంలో ప్రధాన కేసు విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది.


రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాలు భూదాన్(Maheshwaram Bhoodan) భూమి ఉంది. ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అందులో సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ 50 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో.. వారు అందులో ప్లాట్లుగా విభజించి.. విక్రయాలు చేపట్టారు. అయితే ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు(Telangana High Court) కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఈ భూములకు సంబంధించి లావాదేవీలపై కోర్టు స్టే విధించింది. ఇక ఈ అంశంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు.. గతంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు గుర్తించారు.


ఇవి కూడా చదవండి..

గాంధీనే విడిచి పెట్టలేదు, నేనెంత... ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గే

ఇన్ఫోసిస్‌లో ఉన్నంత మాత్రాన వాళ్లకి అన్నీ తెలుసా.. సిద్ధరామయ్య మండిపాటు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 17 , 2025 | 08:57 PM