US Green Card Lottery: భారతీయులకు ట్రంప్ షాక్..ఆ గ్రీన్ కార్డ్ లాటరీలో నోఛాన్స్
ABN , Publish Date - Oct 17 , 2025 | 07:43 PM
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయులకు ట్రంప్ మరో బిగ్ షాక్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయులకు ట్రంప్ మరో బిగ్ షాక్ ఇచ్చారు. యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీలో పాల్గొనేందుకు భారతీయులకు 2028 వరకు అవకాశం లభించదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ లో గత ఐదేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను ఎంచుకుంటున్నట్లు తెలిపాయి. ఏటా 50 వేల మంది లోపు అమెరికాకు వలసవచ్చే దేశాలకే ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం. అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అమెరికాలోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
గత కొన్నేళ్లుగా అమెరికాకు(America) భారత్ నుంచి అధికంగా వలసలు ఉండడంతో భారతీయులకు ఈ వీసా కార్యక్రమానికి కావాల్సిన అర్హత పరిమితి మించిపోయిందని, అందువల్లే ఈ లాటరీలో(US Green Card Lottery) పాల్గొనడానికి భారతీయులకు అవకాశం ఇవ్వట్లేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. వారి డేటా ప్రకారం..అమెరికాకు 2021లో, 93,450 మంది భారతీయులు వలస రాగా.. 2022లో ఈ సంఖ్య 1.27 లక్షకు చేరింది. ఇది అమెరికాకు వస్తున్న దక్షిణ అమెరికన్ (99,030), ఆఫ్రికన్(African) (89,570), యూరోపియన్(Europian) (75,610) వలసదారుల సంఖ్య కంటే ఎక్కువ ఉందని పేర్కొంది. 2023లో 78,070 మంది ఇండియన్స్ అమెరికాకు(America) వలస వచ్చారు. ఈ రికార్డుల ఆధారంగా 2028 వరకు భారతీయులను యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీలకు అనర్హులుగా నిర్ణయించారని తెలుస్తోంది.
మరోవైపు తాజాగా పెరోల్ ఫీజుపై నోటిఫికేషన్ జారీ అయ్యింది. అందులో కొన్నిరకాల వలసదారులకు అవసరమయ్యే పెరోల్ ఫీజు (Parole Fee)ను 1,000 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. వీసా లేదా ఇతర అధికారిక పత్రాలు లేకుండా యూఎస్(USA)కు వెళ్లేందుకు పెరోల్ అనేది తాత్కాలిక అనుమతి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిపై విదేశీయులను అమెరికాలోకి అనుమతిస్తారు. ఇమిగ్రేషన్(Imigration) అధికారులు సూచించిన సమయం లోపు రుసుమును చెల్లిస్తేనే పెరోల్ పొందడానికి అనుమతినిస్తారు.
ఇవి కూడా చదవండి:
తీవ్ర విషాదం.. సమోసాల కోసం వెళుతూ..
పార్ట్ టైం ఆయాకు 45 వేల జీతం.. విదేశీ మహిళపై విమర్శలు..