Share News

Student Yamini Priya: సైకోలా మారిన యువకుడు.. వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి..

ABN , Publish Date - Oct 17 , 2025 | 06:54 PM

గురువారం సాయంత్రం ప్రియ కాలేజీ ముగించుకుని ఇంటికి వస్తూ ఉంది. మంత్రి మాల్ వెనకాల ఉండే రైల్వే ట్రాక్స్ దగ్గర విఘ్నేష్ ఆమెను అడ్డగించాడు. ప్రియ కళ్లల్లో ఉప్పు చల్లి గొంతు కోసేశాడు.

Student Yamini Priya: సైకోలా మారిన యువకుడు.. వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి..
Student Yamini Priya

ఓ యువకుడు సైకోలా మారిపోయాడు. పెళ్లికి అంగీకరించలేదన్న కోపంతో యువతిని దారుణంగా గొంతు కోసి చంపేశాడు. పక్కా ప్లాన్‌తో యువతిని మర్డర్ చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల యామిని ప్రియ డిగ్రీ చదువుతోంది. గత కొన్ని నెలలుగా విఘ్నేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో ప్రియ వెంటపడుతున్నాడు.


ప్రతీ రోజూ వేధిస్తూ ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఆ వేధింపులు ఎక్కువయ్యాయి. పెళ్లి చేసుకోమంటూ టార్చర్ చేయసాగాడు. అతడు ఎంత టార్చర్ చేసినా ఆమె మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో విఘ్నేష్ ఆమెపై కక్ష గట్టాడు. ప్రియను చంపడానికి నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం తనకు సపోర్టు చేసే నలుగురితో వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాడు. దానికి మిషన్ యామిని అని పేరు కూడా పెట్టాడు. ప్రియ మర్డర్ ప్లాన్ గురించి అందులోనే చర్చించుకునే వారు.


మిగిలిన సభ్యులు ప్రియ కదలికల్ని ఎప్పటికప్పుడు విఘ్నేష్‌కు తెలియజేసేవారు. గురువారం సాయంత్రం ప్రియ కాలేజీ ముగించుకుని ఇంటికి వస్తూ ఉంది. మంత్రి మాల్ వెనకాల ఉండే రైల్వే ట్రాక్స్ దగ్గర విఘ్నేష్ ఆమెను అడ్డగించాడు. ప్రియ కళ్లల్లో ఉప్పు చల్లి గొంతు కోసేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ప్రియ అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని ఈ రోజు (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపిస్తున్న టీటీపీ..

తీవ్ర విషాదం.. సమోసాల కోసం వెళుతూ..

Updated Date - Oct 17 , 2025 | 07:03 PM