Siddaramaiah: ఇన్ఫోసిస్‌లో ఉన్నంత మాత్రాన వాళ్లకి అన్నీ తెలుసా.. సిద్ధరామయ్య మండిపాటు
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:11 PM
కర్ణాటక వెనుకబడి తరగతుల కమిషన్ చేపట్టిన 'సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే'లో పాల్గొన రాదని నారాయణ మూర్తి దంపతులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్యూమరేషన్ కోసం ఆ దంపతుల ఇంటికి వెళ్లినప్పుడు తమకు సర్వే అక్కర్లేదని చెప్పినట్టు అధికారులు తెలిపారు.
బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే (Social and Educational Survey)కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి (Narayana Murthy), రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి (Sudha Murthy) నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (Siddaramaiah) శుక్రవారం నాడు ఘాటుగా స్పందించారు. తాము చేపట్టినది వెనుకబడిన తరగతుల సర్వే కాదని, జనగణన అని చెప్పారు.
'అది వాళ్లకే వదిలిపెట్టాను. ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదు. వాళ్లకి అర్థం కాకపోతే నేను ఏం చేయగలను? ఇన్ఫోసిస్‌లో ఉన్నంత మాత్రానా వాళ్లు సర్వజ్ఞులా. ఇదెంత మాత్రం వెనుకబడి తరగతుల సర్వే కాదని 20 సార్లు చెప్పాం. ఇది మొత్తం జనాభాను లెక్కించే సర్వే' అని సిద్ధరామయ్య తెలిపారు.
కర్ణాటక వెనుకబడి తరగతుల కమిషన్ చేపట్టిన 'సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే'లో పాల్గొన రాదని నారాయణ మూర్తి దంపతులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్యూమరేషన్ కోసం ఆ దంపతుల ఇంటికి వెళ్లినప్పుడు తమకు సర్వే అక్కర్లేదని చెప్పినట్టు అధికారులు తెలిపారు. తాము వెనుకబడిన తరగతులకు చెందిన వారముకాదని, ఆ సామాజిక వర్గం కోసం నిర్వహిస్తున్న సర్వే కావడంతో తాను ఇందులో పాలుపంచుకోవడం లేదని నారాయణ మూర్తి దంపతులు తెలిపారు. తమ విషయంలో సర్వేకు ఎలాంటి ఔచిత్యం లేదని ప్రకటిస్తూ సర్వే ఫారంపై సుధామూర్తి సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్టు పేర్కొంటూ మూర్తి దంపతులు డిక్లరేషన్ కూడా ఇచ్చారు.
డీకే ఏమన్నారంటే..
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వేకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, సర్వేలో పాల్గొనమని తాము ఎవరినీ బలవవంత పెట్టడం లేదని, ఐచ్ఛికంగా సర్వేలో పాల్గొనవనచ్చని చెప్పారు.
కాగా, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో మోహన్‌దాస్ పాయ్ సైతం కులసమీకరణపై విమర్శలు గుప్పించారు. 'ఉద్యోగులకు లభిస్తున్న పెద్ద పేమెంట్లు, ప్రయోజనాలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. కర్ణాటకలో మంత్రలకు మంచి ఉద్యోగాలు, టక్నాలజీ, అభివృద్ధి కంటే కులం, కుల సర్వేలు, బుజ్జగింపులపైనే ఎక్కువ ఆసక్తి ఉంది' అని అన్నారు. కర్ణాటక హైకోర్టు కూడా ఇటీవల తమ ఉత్తర్వుల్లో సోషియో-ఎకానమిక్, ఎడ్యుకేషన్ సర్వే తప్పనిసరి కాదని బహిరంగంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలపై సర్వేయర్లు పట్టుబట్ట రాదని, సేకరించిన సమాచారం మొత్తం బీసీ కమిషన్‌కు మినహా పూర్తి కాన్ఫిడెన్సియల్‌గా ఉంచాలని ఆదేశాలిచ్చింది. వెనుకబడిన తరగతుల వారికి ప్రయోజనాలు చేకూర్చేందుకు ఉద్దేశించిన సర్వేలోని సమాచారం పౌరుల హక్కులను ఉల్లంఘించేలా ఉండరాదని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
నితీష్‌తో అమిత్‌షా భేటీ.. మొదటి విడత నామినేషన్లకు ఇవాళే చివరిరోజు
మంగళూరులోనూ శ్రీవారి ఆలయం.. భూమి మంజూరు చేసిన ప్రభుత్వం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి