Share News

Mallu Ravi: కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

ABN , Publish Date - Aug 18 , 2025 | 02:13 PM

కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని.. అందుకే తెలంగాణ రాష్టానికి చెందిన ఎంపీలందరం వాయిదా తీర్మానం ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెల్లడించారు.

Mallu Ravi:  కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
Telangana MPs demand 3 lakh MT urea from Centre

ఢిల్లీ: రాష్ట్రానికి ఇవ్వాల్సిన 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాలంటూ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే యూరియా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు కోరినప్పటికీ కేంద్రం జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. రైతులు ఇప్పటికే పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తున్నారని.. రాష్ట్ర సమస్యను లేవనెత్తాలనుకున్నప్పుడల్లా పార్లమెంట్ వరుసగా వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.


ప్రస్తుతం కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోరినట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫెర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీలో యూరియా విడుదల చేయాలని కోరుతామని ఎంపీ మల్లు రవి అన్నారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నడ్డా కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు సైతం కేంద్రమంత్రి నడ్డాకు ఇచ్చే లేఖను అందజేస్తామని పేర్కొన్నారు. రామగుండంలో ఫెర్టిలైజర్ కంపెనీ ఉంటే ఢిల్లీ నోయిడాలో కూర్చొని అధికారులు విధులు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

డ్రమ్ములో పురుషుడి కుళ్లిన శవం.. ఫ్యామిలీ మిస్సింగ్..

చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..

Updated Date - Aug 18 , 2025 | 02:14 PM