Elk Crash: ప్రముఖ మోడల్‌ను బలి తీసుకున్న దుప్పి.. అత్యంత దారుణమైన స్థితిలో..
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:31 PM
Elk Crash: వేగంగా వెళుతున్న కారుకు అడ్డంగా ఓ దుప్పి ఠక్కున రోడ్డుపైకి వచ్చేసింది. కారు వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో దుప్పి కారు అద్దం బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది.
దుప్పి కారణంగా ఓ ప్రముఖ మోడల్ ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. వారు ప్రయాణిస్తున్న కారు దుప్పిని ఢీకొనటంతో పెను ప్రమాదం జరిగింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో గాయపడ్డ మోడల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన 30 ఏళ్ల క్సెనియా అలెగ్జాండ్రోవా మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2017లో మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొంది. జులై 5వ తేదీన ఆమె తన భర్తతో కారులో బయటకు వెళ్లింది.
కారు ట్వెర్ అబ్‌లాస్ట్ ప్రాంతంలో రోడ్డుపై వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న కారుకు అడ్డంగా ఓ దుప్పి ఠక్కున రోడ్డుపైకి వచ్చేసింది. కారు వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో దుప్పి కారు అద్దం బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది. దుప్పి కొమ్ములు ప్యాసింజర్ సీట్లో కూర్చున్న క్సెనియా తలను బలంగా తాకాయి. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలు అయ్యాయి. కారు నడుపుతున్న ఆమె భర్తకు కూడా గాయాలు అయ్యాయి.
అదే రోడ్డుపై వెళుతున్న వాహనదారులు వీరిని చూశారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్‌లో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి క్సెనియా కోమాలోనే ఉంది. దాదాపు నెల రోజులకు పైగా చికిత్స తీసుకుంటున్నా కూడా లాభం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 12వ తేదీన చనిపోయింది. ఇక్కడ మరో విషాదం ఏంటంటే.. గత మార్చి నెలలోనే క్సెవియాకు పెళ్లయింది. పెళ్లైన ఐదు నెలలకే ఆమె జీవితం విషాదంగా ముగిసింది.
ఇవి కూడా చదవండి
ఇలాంటి నటుడ్ని చూసుండరు.. దెయ్యం పట్టినట్లు యాక్టింగ్ ఇరగదీశాడు..
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. గాల్లో ఉండగా విమానంలో మంటలు..