Ramanthapur Issue: రామంతపూర్ ఘటనలో మృతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:10 PM
రామంతపూర్ ఘనటలో మృతిచెదిన బాధితులకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రామంతాపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్: రామంతపూర్ ఘనటలో మృతిచెందిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రామంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని రోడ్డుపక్కన నిలిపివేశారు. అనంతరం యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథం లాగుతున్న తొమ్మిది మందిలో ఐదుగురు అక్కడిక్కకడే మృతిచెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరొకరు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. మరోవైపు కృష్ణాష్టమి వేళ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో హిందు ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి
మేకను మింగిన కొండచిలువు.. గ్రామస్తులు ఏం చేశారంటే..
మనిషి శరీరంలో 'రెండవ గుండె' ఏదో మీకు తెలుసా?