Share News

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Dec 30 , 2025 | 07:29 AM

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు బీహెచ్‌ఈఎల్‌ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రితోపాటు ఇంకా ఈయా ఏరియాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ సిటీ: సంక్రాంతి పండుగ(Sankranti festival)కు శివారు ప్రాంతాలనుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తోంది. బీహెచ్‌ఈఎల్‌ డిపో ఆర్సీపురం నుంచి మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా ట్రాఫిక్‌ రద్దీ లేకుండా అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి(Kakinada, Narasapuram, Visakhapatnam, Rajahmundry), పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడతోపాటు ఇతర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నామని బీహెచ్‌ఈఎల్‌ డిపో మేనేజరు సుధా(BHEL Depot Manager Sudha) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


city2.3.jpg

జనవరి 9 నుంచి 13వరకు స్పెషల్‌ బస్సులుంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌, ముందస్తు రిజర్వేషన్‌ కోసం వెబ్‌సైట్‌లోనూ బుక్‌ చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 9959226149 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


city2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

2న మళ్లీ సభకు వస్తారా?

గర్భధారణ 30 ఏళ్లలోపే...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 30 , 2025 | 07:29 AM