MLC Kavitha: కేసీఆర్ బలిపశువు.. హరీష్‌రావు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్సీ కవిత
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:29 PM
కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇందులో ఆ ఇద్దరిదే కీలకపాత్ర.. కేసీఆర్ బలిపశువును చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha Targets Harishrao: కాళేశ్వరం కమిషన్ నోటీసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. బీఆర్ఎస్ కీలకనేత హరీష్‌రావును టార్గెట్ చేస్తూ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు, ముగ్గురు నేతలే కేసీఆర్‌పై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు, సంతోష్‌ది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని.. వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. నేనిప్పుడు మాట్లాడితే నా వెనుక ఎవరో ఉన్నారంటారని.. కానీ, అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యుణ్ణి చేస్తూ రేవంత్ ప్రభుత్వం మా నాన్నపై సీబీఐ విచారణ వేసింది. నా కడుపు మండిపోతోంది. మా నాన్నకు డబ్బు, తిండిపై ఏనాడూ యావ లేదు. మా నాన్న పరువు పోతే మాకు బాధ.. వాళ్లకు ఏం లేదు. కాళేశ్వరం అవినీతిలో హరీష్‌రావుది మేజర్ పాత్ర. అందుకే హరీష్‌రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు. హరీష్‌రావు, సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌కు ఈ పరిస్థితి దాపురించింది. కేసీఆర్‌ను అడ్డుపెట్టుకుని హరీష్, సంతోష్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. హరీష్‌రావు, సంతోష్‌రావుకు డబ్బు మాత్రమే కావాలి. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోంది: సుదర్శన్ రెడ్డి
BJP మిత్రపక్షం BRS అనే నిజాన్ని నిర్వీర్యం చేసే అవకాశం అందిపుచ్చుకోండి : సామా
Read latest Telangana News And Telugu News