Sama : BJP మిత్రపక్షం BRS అనే నిజాన్ని నిర్వీర్యం చేసే అవకాశం అందిపుచ్చుకోండి : సామా
ABN , Publish Date - Sep 01 , 2025 | 02:44 PM
BJP మిత్రపక్షం BRS అనే నిజాన్ని నిర్వీర్యం చేసే అవకాశం అందిపుచ్చుకోండంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి తెలంగాణ బీజేపీ పెద్దలకు సెటైరికల్ సవాల్ విసిరారు. ఇన్నాళ్లూ CBI కి ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేసిన కేంద్ర మంత్రులు..
ఇంటర్నెట్ డెస్క్ : BJP మిత్రపక్షం BRS అనే నిజాన్ని నిర్వీర్యం చేసే అవకాశం అందిపుచ్చుకోండంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి తెలంగాణ బీజేపీ పెద్దలకు సెటైరికల్ సవాల్ విసిరారు. ఇన్నాళ్లూ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ CBI కి ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు.. ఇప్పుడు తమ డిమాండ్ లోని నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ మరింత పారదర్శకంగా జరిగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆధారాలతో కూడిన నివేదికలతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును CBI కి అప్పగిస్తూ తీర్మానం చేశారని సామా చెప్పారు. ఇక మీరు చొరవ తీసుకొని కేసుపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని, దోషులకు శిక్ష పడే విధంగా చూడాలని కోరుతున్నామని సామా తన ఎక్స్ సందేశంలో తెలంగాణ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రుల్ని కోరారు.
ఇవి కూడా చదవండి
ప్రపంచంలోనే ఎత్తైన గణేశ్ విగ్రహం ఈ దేశంలో ఉంది.!
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూప్రకంపనలు.. 622కు చేరిన మృతుల సంఖ్య..