Share News

Damodar Strong Warning to Officials: అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:06 AM

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఈర్లపల్లి తండాకు చెందిన రవినాయక్ మృతికి సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

Damodar Strong Warning to Officials: అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు
Damodar Strong Warning to Officials

మహబూబ్‌నగర్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఈర్లపల్లి తండాకు చెందిన రవినాయక్ (Ravinayak) మృతికి సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. నిజమేంటో తేల్చి, ఎవరిదైనా నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.


మంత్రి ఆదేశాల మేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్లు, డాక్టర్ రాజారావు, డాక్టర్ నాగేందర్‌‌లతో కమిటీ ఏర్పాటు చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వ్యవహారించినట్లు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఏం జరిగిందంటే..

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2025 | 11:24 AM