KTR vs Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
ABN , Publish Date - Aug 08 , 2025 | 07:52 PM
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా లీగల్ నోటీసు పంపించారు. 48 గంటల్లోగా నా పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
KTR Legal Notice to Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీ ఆరోపణల్లో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించాలని సవాలు విసురుతూ.. బండి సంజయ్ కు అధికారికంగా లీగల్ నోటీసు పంపించారు. రాబోయే 48 గంటల్లో నా పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్‌కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కావడం లేదంటూ ఎక్స్ వేదికగా భగ్గుమన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర మంత్రికి కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడి నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దులు దాటాయి. ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం అతడికి కొత్త కాదని విమర్శించారు. బండి సంజయ్.. నీకు అధికారికంగా లీగల్ నోటీసు పంపిస్తున్నా.. నువ్వు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాసేపట్లో భారీ వర్షం.. హైడ్రా హైఅలర్ట్..
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More Telangana News And Telugu News