Share News

Delhi: కేంద్ర న్యాయశాఖ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Aug 08 , 2025 | 07:47 PM

పలు హైకోర్టుల్లో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 16 మందిని పూర్తికాలం న్యాయమూర్తులుగా నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Delhi: కేంద్ర న్యాయశాఖ సంచలన నిర్ణయం
AP High Court

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పలు హైకోర్టుల్లో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 16 మందిని పూర్తికాలం న్యాయమూర్తులుగా నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా.. ఆరు రాష్ట్రాల్లో న్యాయమూర్తులకు పదోన్నతి ఇస్తూ.. కేంద్ర న్యాయశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.


రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా.. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లను పూర్తికాలం న్యాయమూర్తులుగా నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read:

ఇంట్లో వరమహాలక్ష్మిని ఈ సాధారణ పద్ధతిలో పూజించండి

28 ఏళ్ల క్రితం కనిపించుకుండా పోయి.. మంచులో మమ్మీగా..

Updated Date - Aug 08 , 2025 | 07:47 PM