Minister Savita: పులివెందుల ఎన్నికపై జగన్ భయపడుతున్నాడు : మంత్రి సవిత
ABN , Publish Date - Aug 08 , 2025 | 06:23 PM
తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమని మంత్రి సవిత విమర్శించారు. పోలీసులను అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు పులివెందుల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు పేర్కొన్నారు.
కడప: పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని మంత్రి సవిత అన్నారు. ఆమె ఇవాళ(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. వైసీపీకి పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతామని భయం పట్టుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమని మంత్రి సవిత విమర్శించారు. పోలీసులను అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు పులివెందుల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై జగన్ దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పులివెందులలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. వివేకానంద రెడ్డి జయంతికి కుటుంబ సభ్యులు రావాలన్న భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తామే గెలుస్తామని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు.
Also Read:
వైసీపీ నేతల దాడి.. బాధితుడు పవన్ మిస్సింగ్
తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు