Share News

Tirupati Pawan Missing: వైసీపీ నేతల దాడి.. బాధితుడు పవన్‌ మిస్సింగ్

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:38 PM

తిరుపతి వైసీపీ నేతల చేతుల్లో గాయపడిన బాధితుడు పవన్ ప్రస్తుతం మిస్సింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఇంటికి రాకపోవడంతో పవన్ తల్లిదండ్రులు తల్లడిల్లుపోతున్నారు. పవన్ ఎక్కడున్నావ్ నాన్న.. త్వరగా ఇంటికి రా అంటూ..

Tirupati Pawan Missing:  వైసీపీ నేతల దాడి.. బాధితుడు పవన్‌ మిస్సింగ్
Tirupati Pawan

తిరుపతి: దళిత యువకుడు పవన్‌పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దారుణంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట్లో హల్‌చల్ చేశాయి. ఈ ఘటనపై పోలీసు శాఖ సైతం సీరియస్‌గా తీసుకుంది. అయితే, ప్రస్తుతం బాధితుడు పవన్ ఆచూకీ తెలియడం లేదు. దీంతో అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తన బిడ్డ పవన్ కోసం అల్లాడుతున్న తల్లి నీలం సునీత భావోద్వేగంతో అతడి కోసం ఓ వీడియో విడుదల చేసింది.


ఆ వీడియోలో బాధితుడి తల్లి ఏం మాట్లాడారంటే..

'అరే పవన్ నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను.. నువ్వు ఎక్కడున్నా దయచేసి తిరుపతికి రా... బాబు. నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్ను కొట్టి ఆ వీడియోలు అన్నీ మీ ఫ్రెండ్స్ ద్వారా నాకు పంపడం వల్లే కదా పోలీస్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసాము. నీకు ఎలాంటి భయము అవసరం లేదు‌.. నాన్న.. నీకు చేతులెత్తి మొక్కుతున్నాను.. నువ్వెక్కడున్నా దయచేసి ఇంటికి రా నాన్న.. నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే మాకు ఫోన్ చెయ్ నాన్న.. మేమే అక్కడికి వచ్చి నిన్ను తీసుకు వస్తాము.. మీ నాన్న,.. నేను నిద్ర, అన్నం మానేసి నీకోసం వెతుకుతున్నాము నాన్న...దయచేసి మాకు ఫోన్ చేయరా.. మేము వచ్చి నిన్ను తీసుకువచ్చుకుంటాము'. అంటూ ఎమోషనల్‌ అయ్యారు.


అయితే, అసలు బాధితుడు పవన్ ఎక్కడున్నట్లు? ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ నేతల చేతుల్లో తీవ్రంగా గాయపడిన పవన్ ఏమయ్యాడు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి, అతని స్నేహితులు దళిత యువకుడిని దారుణంగా చిత్రహింసలకు గురిచేసి వీడియోలు వైరల్ చేశారు. పవన్ తీసుకున్న నగదు ఇవ్వలేదనే కారణంతో కిడ్నాప్ చేసి లాడ్జీలో బంధించి అత్యంత్య క్రూరంగా దుడ్డుకర్రలు, పైబర్ లాఠీలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు అభినయ్ అనుచరులు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పవన్ జాడ తెలియకపోవడంతో బాధిత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలా చేయాలని పోలీసులను ప్రాధేయపడుతున్నారు.


Also Read:

యూపీఐ చెల్లింపుల్లో ఇబ్బందులు.. నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న అవాంతరాలు

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన 80 ఏళ్ల వృద్ధుడికి భారీ షాక్.. దాదాపు రూ.9 కోట్ల నష్టం

For More Latest News

Updated Date - Aug 08 , 2025 | 03:20 PM