CM Chandrababu: తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:16 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్క్ వేదికగా పోస్ట్ చేశారు.
అమరావతి: ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు ఉపవాసం ఉంటూ దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని వరలక్ష్మీ వ్రతం చేస్తారు. సిరుల తల్లి లక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని వారి నమ్మకం. ఈ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహాలక్ష్మి మీ ఇంటిల్లిపాదికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్య, ఆనందాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. లోకేశ్ ఎక్స్ లో స్పందిస్తూ.. వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో ప్రత్యేకమైనదన్నారు. వరలక్ష్మీ దేవి అనుగ్రహం అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగ చేయాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరికీ కలగాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేశ్.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు ఉదయానే లేచి భక్తిశ్రద్దలతో పూజలు ప్రారంభించారు. వరలక్ష్మీ వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ. వరలక్ష్మీ దేవి విష్ణుమూర్తి భార్య, లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఈ రోజున స్త్రీలు ఉపవాసం ఉండి, వరలక్ష్మీ దేవిని భక్తితో పూజిస్తారు. తమ కుటుంబసభ్యుల ఆరోగ్యం, సుఖం కోసం దీవెనలు కోరుకుంటారు.
Also Read:
కీలక ఆధారాలతో సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్.!
వరలక్ష్మి వ్రతం.. ఈ అద్భుత కథ మీకు తెలుసా?
For More Latest News