Share News

Bandi Sanjay: కీలక ఆధారాలతో సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్.!

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:01 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కొద్దిసేపట్లో సిట్ విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ తోపాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ ఎదుట హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Bandi Sanjay:  కీలక ఆధారాలతో సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్.!
Bandi Sanjay

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కొద్దిసేపట్లో సిట్ విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ తోపాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ ఎదుట హాజరుకానున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర మంత్రి కీలక ఆధారాలను సిట్‌కు సమర్పించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వాంగ్మూలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఫోన్ ట్యాపింగ్‌ను బీజేపీ జాతీయస్థాయి అంశంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర నిఘా వర్గాల నుండి కేంద్ర మంత్రి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్‌ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు నిఘా వర్గాలు నిర్దారించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం బండి సంజయ్ ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు నిర్దారణ చేశాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై ఆధారాలు సేకరించిన కేంద్ర నిఘా వర్గాలు.. వాటికి సంబంధించి సేకరించిన ఆధారాలను కేంద్ర మంత్రి ముందుంచాయి.


ఈ నేపథ్యంలోనే ఆ ఆధారాలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఎదుట హాజరవుతున్నారని తెలుస్తోంది. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేయడాన్ని, భార్యభర్తల బెడ్రూం మాటలను ట్యాప్ చేయడాన్ని బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై కేంద్ర నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి. కాగా, ఇప్పటికే కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ రావు అంగీకరించడం, నాటి డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు వెల్లడించడంతో కేసీఆర్, కేటీఆర్‌ల చుట్టు ఉచ్చు బిగిస్తోంది.


Also Read:

కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు

గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన.. పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

For More Latest News

Updated Date - Aug 08 , 2025 | 11:36 AM