Share News

Hyderabad: కాసేపట్లో భారీ వర్షం.. హైడ్రా హైఅలర్ట్..

ABN , Publish Date - Aug 08 , 2025 | 05:15 PM

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల వ్యాపించిన కారణంగా మరికాసేపట్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని హెడ్రా హెచ్చరికలు జారీ చేసింది.

Hyderabad: కాసేపట్లో భారీ వర్షం.. హైడ్రా హైఅలర్ట్..
Hyderabad weather alert

Hyderabad Rain Alert: గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సిటీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరికాసేపట్లో నగరవ్యాప్తంగా కుంభవృష్టి కురిసే అవకాశముందని హెడ్రా హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం నుంచి రాత్రి దాకా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. వర్షం ప్రారంభం కాకమునుపే ప్రజలంతా ఇళ్లకు చేరుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.


హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం, దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు జోరుగా కురువనున్నాయి. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదే తరహాలోనే శుక్ర, శనివారాలు కూడా జోరుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానంగా సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు.


మరోవైపు, ఈ నెల 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 13, 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2025 | 05:40 PM