MLA Ramakrishna Reddy: జగన్ అరెస్ట్ ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 08 , 2025 | 07:00 PM
ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాజమండ్రి: గత 78 ఏళ్లలో ఎప్పుడులేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి పూర్తి సహకారం అందిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ తానే అధికారంలోకి వస్తానన్న భ్రమలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు.
లిక్కర్ కుంభకోణంలో జగన్ అరెస్ట్ ఖాయమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో డేట్ చెప్పలేమని, అరెస్ట్ మాత్రం ఖాయమని తెలిపారు. లిక్కర్ కేసు నిందితులు బిగ్‌బాస్ ఎవరో చెప్పినట్లుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అప్పట్లో చంద్రబాబుని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని గుర్తు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ, అందుకే ఆ పార్టీ కార్యక్రమాల్లో సీనియర్ నేతలు పాల్గొనడం లేదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read:
వైసీపీ నేతల దాడి.. బాధితుడు పవన్ మిస్సింగ్
తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు