KTR: రాసిపెట్టుకోండి.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే..
ABN , Publish Date - May 13 , 2025 | 10:11 AM
రాసిపెట్టుకోండి.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. హైడ్రా పేరుతో ఇళ్లను కూలగొట్టి మహాపాపం మూటగట్టుకుందని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వమే అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు కేటీఆర్‌ను కలిసి ముషీరాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజాసమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Toll plaza: ఒకే లేన్.. మిగతావన్నీ క్లోజ్

రాబోయే జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసి, బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేలా పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రజని కాంత్ గౌడ్, ముప్పిడి నర్సింగ్‌రావు, నాగేష్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు
Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
Read Latest Telangana News and National News