Share News

Toll plaza: ఒకే లేన్‌.. మిగతావన్నీ క్లోజ్‌

ABN , Publish Date - May 13 , 2025 | 09:09 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఏర్పాటుచేసిన టోల్‌ ప్లాజాలో లేన్లన్నీ మూసి వేసి కేవలం రెండు మాత్రమే ఓపెన్ చేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల క్రితం 8లేన్లతో నిర్మించిన ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ ప్లాజాను ఏర్పాటు చేశారు. అయితే.. ప్రస్తుతం దీంట్లో కేవలం రెండింటిని మాత్రమే తెరుసంతున్నారు.

Toll plaza: ఒకే లేన్‌.. మిగతావన్నీ క్లోజ్‌

- టోల్‌ప్లాజా లేన్ల మూసివేతతో ఇబ్బందులు

- ఔటర్‌పై వాహనదారుల ఇక్కట్లు

- ఫాస్టాగ్‌కు ఒకటి, క్యాష్‌కు మరొకటి మాత్రమే

- కారణాలు ఏంటంటే సమాధానం కరువు

హైదరాబాద్‌ సిటీ: ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ ప్లాజా(Outer Ring Road Toll Plaza) వద్ద కేవలం ఒక ఫాస్టాగ్‌ లేన్‌ను, ఒక క్యాష్‌ లేన్‌ను మాత్ర మే తెరిచి ఉంచుతున్నారు. మిగతా వాటిని మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలన్నీ ఒకే లేన్‌ వద్ద బారులు తీరాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం 8లేన్లతో నిర్మించిన ఔటర్‌ రింగ్‌రోడ్డుపై 2018 వరకు నగదు టోల్‌ చెల్లింపులే జరిగాయి. చిల్లర కోసం వాహనదారులు వెయిట్‌ చేయాల్సి రావడం వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేది. దీంతో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్ఐడీ) విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ఫీజు వసూలు చేసే సాంకేతిక వ్యవస్థను రూపొందించారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో మినహా ఎక్కడా ఈ విధానం లేదు. హెచ్‌ఎండీఏ ప్రయోగాత్మకంగా అమలు చేయగా అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు మినహా సత్ఫలితాలు వచ్చాయి.

ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూ కాలేజీలో 500 సీట్లకు కోత..


తాజాగా లేన్లు మూసివేత

ఔటర్‌ రింగు రోడ్డుపై బొంగులూరు ఇంటర్‌ఛేంజ్‌(ఎగ్జిట్‌-12) వద్ద ఇరువైపులా ఎంట్రీలో ఐదు టోల్‌ లైన్లు, ఎగ్జిట్‌లో ఐదు టోల్‌ లైన్లు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు ఒక ఫాస్టాగ్‌, ఒక క్యాష్‌ లేన్ల నుంచి మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. మిగతా లేన్లు మూసివేశారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రయాణించే వాహనాల్లో 90 శాతం ఫాస్టాగ్‌ కలిగినవే ఉంటాయి. అవన్నీ ఒకే లేన్‌ గుండా వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.


కారణాలేంటి?

ఫాస్టాగ్‌ లేన్లు ఎన్ని ఎక్కువగా ఉంటే టోల్‌ఫ్లాజాల వద్ద వాహనాల ఆగే సమయం అంత తగ్గుతుంది. శివారు ప్రాంతాలకు వెళ్లేవారిలో చాలా మంది ఔటర్‌ గుండా వెళ్లేందుకే ఆసక్తి చూపుతారు. ట్రాఫిక్‌ జామ్‌ నుంచి తప్పించుకునేందుకు వాళ్లందరూ ఔటర్‌ ఎక్కితే ప్రస్తుతం టోల్‌ప్లాజాల వద్ద ఆగిపోవాల్సి వస్తోంది. అయితే లేన్లు మూసివేయడానికి గల కారణాలను టోల్‌ ప్లాజాల సిబ్బంది చెప్పడం లేదు. సాంకేతిక సమస్యల వల్లే ఫాస్టాగ్‌ లేన్లు మూసేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

city4.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్‌

టోపీ పెట్టుకున్న కోడెనాగు..

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2025 | 09:09 AM