Nitin GadKari: తెలంగాణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన
ABN , Publish Date - May 05 , 2025 | 09:10 AM
Nitin GadKari: తెలంగాణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం నాడు పర్యటించనున్నారు. పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నితిన్ గడ్కరీకి బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలకనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Jairam Gadkari) ఇవాళ(సోమవారం) పర్యటించనున్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు అంబర్‌పేట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 6గంటలకు జీహెచ్ఎంసీ అంబర్‌పేట స్టేడియంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంబర్‌పేట మునిసిపల్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంపై ఇవాళ్టి సభలో వివరణ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వనున్నారు.
గడ్కరీకి బీజేపీ రాష్ట్ర నేతలు ఘనంగా స్వాగతం పలకనున్నారు. అలాగే కాగజ్‌నగర్‌లో జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. గడ్కరీతో పాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి , బండి సంజయ్ , ఎంపీ లక్ష్మణ్ , ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Uttam: ఏపీ నీటి దోపిడీకి బీఆర్‌ఎస్ మద్దతు
72nd Miss World pageant: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..
Harish Rao: డిగ్రీ పరీక్షలు చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థత
Read Latest Telangana News And Telugu News