Share News

Bandi Sanjay VS Congress: మహేష్ గౌడ్ గజినీలా మాట్లాడుతున్నారు.. బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 10:42 AM

తెలంగాణలో ఓటు చోరీ జరిగితే.. కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ సీట్లు కూడా తామే గెలిచే వాళ్లమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేశారు. కర్ణాటక, తెలంగాణలో మీరెలా గెలిచారని బండి సంజయ్ ప్రశ్నించారు.

Bandi Sanjay VS Congress: మహేష్ గౌడ్ గజినీలా మాట్లాడుతున్నారు.. బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు
Bandi Sanjay Kumar VS Congress

కరీంనగర్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ(మంగళవారం) కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలను కలవకుండా రాత్రి పూట యాత్రలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. టీ పీసీసీ చీఫ్ ఒక గజినీ.. ఆయనను ఎవరైనా గుర్తు పడతారా అని ప్రశ్నించారు బండి సంజయ్.


మహేష్ గౌడ్ వార్డు మెంబర్‌గా కూడా గెలిచావా అని బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణలో ఓటు చోరీ జరిగితే.. కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ సీట్లు కూడా తామే గెలిచే వాళ్లమని చెప్పుకొచ్చారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేశారు. కర్ణాటక, తెలంగాణలో మీరెలా గెలిచారని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ బీఆర్‌ఎస్ మనిషి అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయనకు సెక్యూరిటీ కావాలని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఓటు చోరీ జరిగిందని ప్రజలను మహేష్ గౌడ్ అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలే ఓట్ల బిచ్చగాళ్లు అని విమర్శించారు. టోపీలు పెట్టుకుని ఓట్ల కోసం వెళ్లేది కాంగ్రెస్ నేతలే అని ఆక్షేపించారు. రోహింగ్యాలు వచ్చింది కాంగ్రెస్ హయాంలోనేనని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఏం జరిగిందంటే..

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2025 | 10:56 AM