Thummala on Airports: గుడ్ న్యూస్.. తెలంగాణలో ఎయిర్ పోర్టులపై మరో ముందడుగు
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:42 PM
ఢిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఢిల్లీ, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామి (Kumaraswamy)తో తుమ్మల ఇవాళ(మంగళవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి ఈ సమావేశంలో మాట్లాడారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్య అని పేర్కొన్నారు. అక్కడ ఉన్న మినరల్‌ను ఏ విధంగా ఉపయోగించుకుంటారో కేంద్రప్రభుత్వం పరిశీలించి తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
రామ్మోహన్ నాయుడుతో భేటీ..
అలాగే, కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (RamMohan Naidu)ను కలిశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారని అన్నారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూ సేకరణ పూర్తయిందని పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు: ర్యాంకర్ల తల్లిదండ్రులు
ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవం.. రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
For More TG News And Telugu News