Telangana High Court: హిల్ట్ పాలసీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:09 PM
హిల్ట్ పాలసీపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. హిల్ట్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హిల్ట్ పాలసీపై (Hilt Policy) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది. హిల్ట్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్లు దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టుకు ఆయన తెలిపారు. దీనిపై సీబీఐ లేదా ఈడీ దర్యాప్తు చేయించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వెంటనే రిప్లై ఫైల్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
For More TG News And Telugu News