CM Revanth Reddy: ఓయూకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:50 PM
ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలనే ఓ ఆలోచనతో ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా వర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఇవాళ(బుధవారం) సందర్శించారు. ఈ సందర్భంగా ఓయూకు రూ.1000 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేశారు. అలాగే, ఓయూ అభివృద్ధికి రూ.45 లక్షల చెక్కు అందజేశారు పూర్వ విద్యార్థులు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర ‘సర్వం సిద్ధం’ పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా ఉస్మానియా యూనివర్సిటీ వినిపించిందని తెలిపారు.
భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించడానికి ఓయూకు వచ్చానని వివరించారు. గతంలో ముఖ్యమంత్రులను అడ్డుకున్న చరిత్ర ఉందని ప్రస్తావించారు. మీరు ఎందుకు ఓయూకు వెళ్లే ధైర్యం చేస్తున్నారని కొంతమంది తనతో అన్నారని గుర్తుచేశారు. మీరిచ్చే సూచనలు, మేధావులు ఇచ్చే సలహాలతో ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలనే ఓ ఆలోచనతో ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ధైర్యంతో కాదని.. విద్యార్థుల గుండెల నిండా ఉన్న అభిమానంతో ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చానని వ్యాఖ్యానించారు. తమ ప్రసంగాలు చదువుకొని కాదని.. తన మనసులో ఉన్నది చెప్పాలని ఇక్కడకు వచ్చానని చెప్పుకొచ్చారు. గుండెల నిండా అభిమానం నింపుకుని ఓయూకు వచ్చానని తెలిపారు. పురాతన యూనివర్సిటీలో ఉస్మానియా ఒకటని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని అభివర్ణించారు. ఇక్కడకు రావాలంటే ధైర్యం కాదని.. అభిమానం కావాలని చెప్పుకొచ్చారు. తెలంగాణలో చదువు లేకున్నా ఆధిపత్యాన్ని సహించరని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్
Read Latest Telangana News and National News