Share News

CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Dec 01 , 2025 | 03:49 PM

మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
Telangana CM Revanth Reddy

హైదరాబాద్ , డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ పనులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి.


గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆలయ పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దని సూచించారు. మేడారం ఆలయ నిర్మాణంలో చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దని ఆదేశించారు. గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గద్దెల దగ్గర నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.


గద్దెలకు గ్రాండ్ లుక్ వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గుడి చుట్టూరా పచ్చదనం అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 01 , 2025 | 03:59 PM