CEO Sudarshan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఈవో సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:04 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు రాష్ట్ర అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో సుదర్శన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) చాలా సంస్కరణలను తీసుకువస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి (Telangana CEO Sudarshan Reddy) తెలిపారు. BLO, బూత్ లెవెల్ ఏజెంట్స్, ఈఆర్ఓలతో ఇంటరాక్ట్ కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. BLA, BLOలకు ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. పోలింగ్ స్టేషన్‌లలో మినిమం ఓటర్ల సంఖ్యను 1200కు కుదించిందని గుర్తుచేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆంక్షలను 200 మీటర్ల నుంచి కిలో మీటర్ వరకు పెంచిందని వెల్లడించారు సీఈఓ సుదర్శన్ రెడ్డి.
పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ వరకు పార్టీలు ప్రచారం చేయడానికి వీలు లేదని సీఈఓ సుదర్శన్ రెడ్డి అన్నారు. పోలింగ్ సెంటర్స్ వద్ద ఇక నుంచి మొబైల్ ఫోన్స్ కోసం డిపాజిట్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈనెల(జూన్) 26, 27 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర BLA, BLOలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ట్రైనింగ్ ఇస్తోందని చెప్పారు. నేషనల్ లెవెల్ లీగల్ కాన్ఫరెన్స్ కోసం ముగ్గురు న్యాయవాదులకు శిక్షణ ఇస్తోందని అన్నారు. రూరల్‌లో 87శాతం, అర్బన్‌లో 67శాతం ఓటర్, ఆధార్ కార్డ్ లింక్ జరిగిందని స్పష్టం చేశారు సీఈఓ సుదర్శన్ రెడ్డి.
రెండు, మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే ఉండకపోవచ్చని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని గుర్తుచేశారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని అన్నారు. జూబ్లీహిల్స్‌లో డిసెంబర్ వరకు కొత్త ఎమ్మెల్యే ఎన్నిక జరగాలని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్ షురూ
Read Latest Telangana News And Telugu News