BJP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు..
ABN , Publish Date - Oct 04 , 2025 | 04:09 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. దీని కోసం త్రి మెన్ కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు తమతమ కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈనెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుండగా.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఈనెల 5లోగా ప్రతీ స్థానానికి ముగ్గురు పేర్లను ఇవ్వాలని రాష్ట్ర బీజపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.. పార్టీ నాయకులను ఆదేశించారు. జట్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత రాష్ట్ర కమిటీకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత జిల్లా పార్టీ కోర్ కమిటీలకు అప్పగించనున్నారు.
అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కూడా సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. దీని కోసం త్రి మెన్ కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లో అభిప్రాయ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ధర్మరావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులుకు చోటు దక్కింది. ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ