Supreme Court On Group -1 Exams: గ్రూప్ -1.. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
ABN , Publish Date - Oct 07 , 2025 | 09:04 PM
గ్రూప్ -1 పరీక్షల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ -1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): గ్రూప్ -1 పరీక్షల (Group -1 Exams) వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. గ్రూప్ -1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్ -1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు బాధితులు. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టింది. హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News