South Central Railway: శుభవార్త.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:58 AM
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
హైదరాబాద్, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ (Sankranti Festival) నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ (South Central Railway) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఇవాళ(శుక్రవారం) మాట్లాడారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా నెలరోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించామని తెలిపారు. 124 స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
రిజర్వేషన్లన్నీ నెల రోజుల ముందుగానే ఫుల్ అవుతున్నాయని తెలిపారు. ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు. వెయిటింగ్ లిస్ట్‌ను బట్టి ప్రత్యేక రైళ్లు పెంచుతామని వెల్లడించారు. విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి రూట్లల్లో ప్రయాణికుల నుంచి భారీగా డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు.
జనవరి 24వ తేదీ వరకు మొత్తం 400కు పైగా స్పెషల్ ట్రైన్లు నడుపుతామని స్పష్టం చేశారు. ఈసారి హైదరాబాద్ నుంచి 30 లక్షల మందికి పైగా రైళ్ల ద్వారా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని సీపీఆర్వో శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణి కార్మికుల సమస్యలు పట్టవా.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
రామ్ సుతార్ మృతి శిల్ప కళకు తీరని లోటు: కేసీఆర్
Read Latest Telangana News and National News