Political Affairs Committee Meeting: కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం.. ఏడు అంశాలపై చర్చ
ABN , Publish Date - Aug 23 , 2025 | 08:26 AM
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కోర్ట్ తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో చర్చలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దె చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చలు కొనసాగానున్నాయి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామల దృష్ట్యా.. కాంగ్రెస్ వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ(ఆగస్టు 23) పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. గాంధీ భవన్లో సాయంత్రం ఆరు గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు హాజరుకానున్నారు. సమావేశానికి అడ్వైజరీ కమిటీకి సైతం టీపీసీసీ ఆహ్వానం పంపినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో చోటుచేసుకున్న 7 అంశాలపై కమిటీలో చర్చించనున్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కోర్ట్ తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయాలపై చర్చలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దె చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నాయకులను దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణం రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కమిటీల నిర్మాణంపై చర్చలు నాయకులు చర్చలు జరపనున్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
అయితే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొంతకాలంగా.. అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా యూరియాపై కూడా ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రతిపక్షలు కూడా యూరియా విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. వీటన్నిటికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలో పెట్టిందని చెప్పవచ్చు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడో ఓ చోటు ఏదో ఒక విధంగా బయటపడుతునే ఉన్నాయి. ఈ అంశాల దృష్ట్యా ఇవాళ నిర్వహించే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్