TG High Court: తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 16 , 2025 | 02:30 PM
తెలంగాణ హైకోర్టులో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి, మురళీనాయక్‌లు పిల్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ ఎమ్మెల్యేలు పిల్ వేశారు.

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి, మురళినాయక్‌లు పిల్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ ఎమ్మెల్యేలు పిల్ వేశారు. ఈ పిటీషన్‌పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఖాజాగూడలోని సర్వే నెం.119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని న్యాయవాది కోర్టుకు వివరించారు.
సర్వే నెంబర్‌ని మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని పిల్‌లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. 2023లో రంగారెడ్డి కలెక్టర్ నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లలో ఒక్కో దాంట్లో 47 అంతస్థులు నిర్మిస్తున్నారని న్యాయవాది చెప్పారు. ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ న్యాయస్థానానికి వివరించారు.
ఓ ప్రైవేట్ పాఠశాలకు 150మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని న్యాయవాది తెలిపారు. దీనివల్ల పర్యావరణం కాలుష్యమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని ఎమ్మెల్యేలు కోరారు. ఈ భూమికి సంబంధించి సీఎస్, ప్రతివాదులకు మరోసారి వినతిపత్రం ఇవ్వాలని పిటీషనర్లను సీజే ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News