Gulzar House Fire Accident:గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం.. అధికారులు ఏం తేల్చారంటే..
ABN , Publish Date - May 19 , 2025 | 08:25 PM
Gulzar House Fire Accident: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో ఆదివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17మంది మృతిచెందారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో (Gulzar House) మే18వ తేదీ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు గుర్తించారు. ఈ అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని ఫైర్ అధికారులు తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. కంప్రెషర్ పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయని గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో భారీగా పొగ అలుముకుందని చెప్పారు.
ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలోకి దట్టంగా పొగ వ్యాపించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు యత్నించారు. టెర్రస్ నుంచి బయటకు రాలేక కుటుంబసభ్యులు మళ్లీ కిందకు వచ్చారు. మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగసిపడటంతో లోపలే కుటుంబ సభ్యులు ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారక స్థితిలోకి కుటుంబసభ్యులు వెళ్లిపోయారు.
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై హెచ్‌ఆర్సీ సీరియస్
గుల్జార్ హౌస్ వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంపై హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది. ఈ ప్రమాద ఘటనపై సుమోటోగా కేసు విచారణకు హెచ్‌ఆర్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. భవన భద్రత, విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ పరమైన నిబంధనలు పాటించలేదని మీడియాలో వచ్చిన కథనాలపై హెచ్‌ఆర్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందడానికి గల కారణాలపై జూన్ 30వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి , హైదరాబాద్ పోలీస్ కమిషనర్ , అగ్నిమాపక శాఖ డీజీ , టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లకు హెచ్‌ఆర్సీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News