Hyderabad Water Board : జలమండలి మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:09 PM
జలమండలిలో రెవెన్యూ పెంపునకు కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రకటించారు. జూబ్లీహిల్స్ థీమ్ పార్క్‌లో వాటర్ బోర్డు రెవెన్యూ, ఐటీ విభాగ అధికారులతో సమావేశం అయ్యారు. డొమెస్టిక్ కేటగిరీ కింద ఉన్న కమర్షియల్ కనెక్షన్లను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు21(ఆంధ్రజ్యోతి): జలమండలిలో (Hyderabad Water Board) రెవెన్యూ పెంపునకు కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రకటించారు. జూబ్లీహిల్స్ థీమ్ పార్క్‌లో వాటర్ బోర్డు రెవెన్యూ, ఐటీ విభాగ అధికారులతో ఇవాళ(గురువారం) సమావేశం అయ్యారు. డొమెస్టిక్ కేటగిరీ కింద ఉన్న కమర్షియల్ కనెక్షన్లను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. మీటర్ లేని కనెక్షన్లకు బిల్లింగ్ వేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రెవెన్యూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.
బల్క్ కనెక్షన్లకు ఖచ్చితమైన పాలసీ తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. మీటర్ రీడింగ్ ఏజెన్సీల నియామకానికి టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. కొత్తగా బిల్డింగ్ కట్టుకునే వారికి వాటర్ ఫీజుబిలిటీ ధ్రువపత్రం ఆన్‌లైన్‌లో ఇవ్వాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీశైలంలో కుట్రలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం నివేదిక.. హై కోర్టులో వాడివేడిగా వాదనలు
Read Latest Telangana News And Telugu News