Musi Floods in Hyderabad: భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్
ABN , Publish Date - Sep 13 , 2025 | 10:58 AM
తెలంగాణతో పాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద నీరు వస్తోంది. మూసీకి కూడా బారీ స్థాయిలో వరదనీరు చేరడంతో భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం దాల్చింది.
హైదరాబాద్, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతో పాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తోండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద నీరు వస్తోంది. మూసీకి కూడా బారీ స్థాయిలో వరదనీరు చేరడంతో భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఉస్మాన్ సాగర్ (Usman Sagar), హిమాయత్ సాగర్ (Himayat Sagar) జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల 10 గేట్లు ఎత్తి 8300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు అధికారులు.
ఈ క్రమంలో ముందస్తుగా నార్సింగ్ ORR సర్వీస్ రోడ్డు , ORR ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) సూచించారు. ఈ క్రమంలో మంచిరేవుల - నార్సింగ్‌కు రాకపోకలు బంద్ చేశారు.
మంచిరేవుల బ్రిడ్జిపై నుంచి కూడా మూసీ వరద ప్రవహిస్తోండటంతో జియాగూడ, పురానాపుల్ మధ్య రాకపోకలు మూసివేశారు. అలాగే, జియాగూడ 100 ఫీట్ రోడ్డు పైకి వరదనీరు చేరింది. పురానాపూల్, హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుషాయిగూడ వ్యాపారి హత్య.. నిందితుల ప్లాన్ ఇదే..
కూకట్‌పల్లి రేణు మర్డర్ కేసును మలుపు తిప్పిన క్యాబ్ డ్రైవర్..
Read Latest Telangana News and National News