Kushaiguda Case: కుషాయిగూడ వ్యాపారి హత్య.. నిందితుల ప్లాన్ ఇదే..
ABN , Publish Date - Sep 13 , 2025 | 10:22 AM
కుషాయిగూడ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన విషయాలను కుషాయిగూడ పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): కుషాయిగూడ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి (Kushaiguda Real Estate Businessman Srikanth Reddy) హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన విషయాలను కుషాయిగూడ పోలీసులు ఇవాళ(శనివారం) మీడియాకు వెల్లడించారు. వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. శాంతినగర్, లాలాపేట్ ప్రాంతాల్లో ఆయన వ్యాపారం చేస్తున్నాడు.
అయితే, లాలాపేట్‌కు చెందిన డానియల్, ధన్‌రాజ్‌లను బౌన్సర్లుగా పెట్టుకున్నాడు శ్రీకాంత్ రెడ్డి. వీరిద్దరిపైనా లాలాపేట్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయి. భోగారంలో ఓ భూమి విషయంపై శ్రీకాంత్ రెడ్డి డీల్ చేస్తున్నాడు. అందులో సహాయం చేసినందుకు డానియల్, ధన్‌రాజ్‌కు ఒక్కొక్కరికి రూ. కోటి ఇస్తానని ఆయన హామీ ఇచ్చాడు. కానీ డబ్బు ఇవ్వకుండా జాప్యం చేశాడు శ్రీకాంత్ రెడ్డి.
ఆయనను తొలగించి ల్యాండ్ సెటిల్‌మెంట్‌ను చేసి డబ్బులు తామే తీసుకోవాలని నిందితులు ప్లాన్ చేశారు. గతంలో ధనరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో పనిలో నుంచి తీసేశాడు శ్రీకాంత్ రెడ్డి. అయితే, మళ్లీ తిరిగి కొద్దిరోజుల క్రితమే ధనరాజును పనిలో చేర్చుకున్నాడు శ్రీకాంత్ రెడ్డి. వ్యక్తిగత గొడవలు, ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయంలో కక్ష పెంచుకున్నాడు ధనరాజ్. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డిని నిందితులు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు కుషాయిగూడ పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News