MP Chamala Kiran Kumar: బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్..
ABN , Publish Date - Aug 26 , 2025 | 05:33 PM
బిహార్ రాష్ట్రంలో ఎలాంటి ప్రజా లెక్కలు లేకుండా.. మైనారిటీ, క్రిస్టియన్ల ఓట్లని తొలగించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ఓట్లు పడవనే వాటిని తీసేశారని విమర్శించారు. ఓట్ల చోరీపై చర్చ చేస్తే దొంగలెవరో బయటపడుతారని ఎద్దేవా చేశారు. అందుకోసమే.. కనీసం చర్చ కూడా చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు.
హైదరాబాద్: కరీంనగర్‌కి వచ్చి కార్పొరేటర్ లాగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఓటు చోరీ గురించి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడితే దానికి సంబంధం లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఓటు చోరీ మీద క్లియర్‌గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. బెంగళూరులో దొంగ ఓట్ల గురించి కూడా చెప్పామని పేర్కొన్నారు. దీనిపైన పార్లమెంట్లో చర్చ చేయాలని పట్టు పట్టామని చెప్పుకొచ్చారు. నిజంగా ఓటు చోరీ జరగకపోతే చర్చ జరపాలి కదా.. ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు. మీరు కూడా హౌస్‌లోనే ఉన్నారు కదా అంటూ బండి సంజయ్‌ని నిలదీశారు. ఒకవైపు చర్చ కోసం తాము పట్టుబడుతుంటే.. మరోవైపు స్పెషల్ ఇంటెన్షన్ రివ్యూ ద్వారా బిహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారని చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిహార్ రాష్ట్రంలో ఎలాంటి ప్రజా లెక్కలు నిర్వహించకుండా.. మైనారిటీ, క్రిస్టియన్ల ఓట్లని తొలగించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి ఆ ఓట్లు పడవనే వాటిని తీసేశారని ధ్వజమెత్తారు. చర్చ చేస్తే దొంగలేవరో బయటపడుతుందని.. కనీసం చర్చ కూడా చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ప్రెస్‌మీట్ పెట్టి కేవలం రాజకీయం మాట్లాడిందని ఆరోపించారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఈసీ సమాధానం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఓటు చోరీ గురించి చర్చ పెట్టకుండా కరీంనగర్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం కాంగ్రెస్‌ని ఓడించాలని ఉద్దేశంతోనే న్యూట్రల్ బాడీని కేంద్రం ఆపరేట్ చేస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలగించిన 65 లక్షల ఓటర్ల లిస్టుని వెబ్సైట్లో పెట్టాలని చామల డిమాండ్ చేశారు.
Also Read:
ప్రాణం తీసిన ప్రేమ.. ఏం జరిగిందంటే..
రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలే.. వానలు
For More Telangana News and Telugu News..