Minister Ponnam Prabhakar: హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు.. మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 09 , 2025 | 07:09 PM
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరుఫున హైకోర్టులో బలమైన వాదనలు వినిపించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ వేసి, సబ్ కమిటీ వేశామని గుర్తు చేశారు. అనంతరం కేబినెట్ ఆమోదించి.. శాసనసభలో చట్టం చేసి గవర్నర్‌కి బీసీ బిల్లును పంపడం జరిగిందని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని పొన్నం నిలదీశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..
రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..