Good News To Farmers: రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:12 PM
రైతులు, రైతుల కూలీలు, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకం.. అటల్ పెన్షన్ యోజన. ఈ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 09: అసంఘటిత రంగంలోకి కార్మికులకు పెన్షన్ అందించేందుకు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో తాజాగా కేంద్రం కీలక మార్పులు చేర్పులు చేసింది. చందాదారుడు సమర్పించే.. సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫారాన్ని మార్చినట్లు వెల్లడించింది. పాత పద్దతి ప్రకారం 2025, సెప్టెంబర్ 30వ తేదీ వరకే రిజిస్ట్రేషన్లు ముగిశాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2025, అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ఫారం తీసుకు వచ్చినట్లు తెలిపింది.
ఈ పథకాన్ని అత్యంత సులభతరం చేయడం కోసమే ఈ సంస్కరణ ఉద్దేశ్యమని స్పష్టం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి సవరించిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) ఫారం మాత్రమే రిజిస్ట్రేషన్ కోసం ఆమోదిస్తున్నట్లు చెప్పింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను అనుసరించి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తగిన మార్పులు చేసినట్లు వివరించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్ ఫార్మాట్‌ను సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగించడం లేదని వివరణ ఇచ్చింది. ఎందుకంటే.. సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ ప్రోటీన్ (గతంలో NSDL) పాత ఫార్మేట్‌ను ఆమోదించదని తెలిపింది.
దేశంలోని వ్యాపారులు, గిగ్ వర్కర్లు సహా పెన్షన్ పథకం పరిధిలోకి రాని ఉద్యోగులు ఈ పథకంలో చేరవచ్చు. అయితే ఖాతాదారుడు.. బ్యాంకు లేదా పోస్టాఫీసులో అకౌంట్ కలిగి ఉండాల్సి ఉంటుంది. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చని పేర్కొంది. కానీ ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఇందులో చేరే అర్హత లేదని క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులు. ఇక ఖాతాదారుకు 60 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి పెన్షన్ అందనుంది. నెలకు రూ.210 చొప్పున చెల్లిస్తే గరిష్ఠంగా రూ. 5 వేలు వరకు పెన్షన్ పొందే వీలు ఉంది. కంట్రిబ్యూషన్ ఆధారంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే.. మీరు జమ చేసే మొత్తం నగదుపై మీ పెన్షన్ ఆధారపడి ఉంటుంది.
రైతులు, రైతు కూలీలు, తాపీ పని చేసే వారితోపాటు గిగ్ వర్కర్లు వారికి 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రతి నెల రూ.1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్.. ఈ పథకం ద్వారా అందనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ టార్గెట్‌గా మహిళా ఉగ్రవాదుల బృందం.. పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కొత్త వ్యూహం
భయాందోళనలో ఐపీఎస్ భార్య.. సీఎంకు లేఖ
మరిన్ని బిజినెస్, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి