Share News

Senior IAS Officer Letter To CM: భయాందోళనలో ఐపీఎస్ భార్య.. సీఎంకు లేఖ

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:46 PM

తన భర్త ఆత్మహత్య చేసుకుని రోజులు గుడుస్తున్న.. అందుకు కారకులైన వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఐపీఎస్ అధికారి భార్య అమినిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుంటే ఈ కేసు దర్యాప్తును పక్కదారి పడుతుందంటూ అనుమానం వ్యక్తం చేశారు.

Senior IAS Officer Letter To CM: భయాందోళనలో ఐపీఎస్ భార్య.. సీఎంకు లేఖ
IAS Officer Amneet P Kumar

హర్యానా, అక్టోబర్ 09: తన భర్త మృతికి బాధ్యులైన వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయ్యాలని ప్రభుత్వాన్ని ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ భార్య అమినిత్ పి కుమార్ డిమాండ్ చేశారు. ఆ క్రమంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ కుమార్ సింగ్ సైనీకి ఆమె గురువారం లేఖ రాశారు. సదరు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలంటూ ఆ లేఖలో సీఎం సైనీకి ఆమె విజ్ఞప్తి చేశారు. లేకుంటే.. ఈ కేసు దర్యాప్తులో వారు జోక్యం చేసుకుంటారని సందేహం వ్యక్తం చేశారు. అలాగే సాక్ష్యాధారాలను వారు తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. అదే విధంగా ఈ కేసు దర్యాప్తుపై వీరు ప్రభావితం చేస్తారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. వారి నుంచి తమ కుటుంబానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందారు. వారి నుంచి తమకు బెదిరింపులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆ లేఖలో ఆమె స్పష్టం చేశారు.


తన కుటుంబానికి రక్షణ కల్పించాలని సీఎం సైనీని ఆమె కోరారు. తన భర్త మరణించి రోజులు గడుస్తున్నా.. నేటికి ఆయనను వేధించి, అవమానించి, మానసిక హింసకు గురి చేసిన వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని విచారం వ్యక్తం చేశారు. అదీకాక తన భర్త మృతికి కారకులైన అధికారులంతా ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఈ సందర్భంగా ఆమె ఆ లేఖలో వివరించారు. ఈ ఉన్నత స్థాయి.. శక్తివంతమైన ఈ అధికారులు తనతోపాటు తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో శాఖ పరంగా లేకుంటే ఇతరత్రా తనను ఇరికించే ప్రయత్నాలు చేయవచ్చని ఈ సందర్భంగా ఆమె భయాందోళన చెందారు. తన భర్త ఆత్మహత్య గురించి తెలిసిన వెంటనే.. తన కుమార్తెను భర్త ఉన్న ప్రదేశానికి పంపానని ఆ లేఖలో చెప్పారు. ఆ సమయానికి తన భర్త ఇంటి బేస్‌మెంట్‌లో విగత జీవిగా పడి ఉన్నారని తన కుమార్తె వివరించిందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ హర్యానా కేడర్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య అమినిత్ పి కుమార్ సైతం అదే రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు. అయితే పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో.. అమినిత్ పి కుమార్ జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బృందం జపాన్‌లో పర్యటిస్తుంది. ఆ బృందంలో ఆమె సైతం ఉన్నారు.


హర్యానా పోలీస్ శాఖలో పూరన్ వై కుమార్ తీవ్ర కుల వివక్షకు గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో బుధవారం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పుచుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. పూరన్ వై కుమార్.. హర్యానాలో అడిషనల్ డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ టార్గెట్‌గా మహిళా ఉగ్రవాదుల బృందం.. పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కొత్త వ్యూహం

ప్రయాణికులకు శుభవార్త.. దీపావళి, ఛట్ పూజ సందర్భంగా 12000 ప్రత్యేక రైళ్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2025 | 04:20 PM