Share News

Caught on camera: కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:44 PM

ఎవరి ప్రాణానికి ఎప్పుడు ముప్పు ఏర్పడుతుందో..ఎవరికి తెలియదు. కానీ విధి నిర్వహాణలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారికి ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. దీంతో అతడు కుప్పుకూలిపోయాడు.

Caught on camera: కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..

న్యూఢిల్లీ: గుండె పోటు మరణాలు దేశవ్యాప్తంగా కలవరపెడుతున్నాయి. వయస్సుతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా.. అత్యధికులు గుండెపోటుకు గురవుతున్నారు. కాలనుగుణంగా తీసుకునే ఆహారంతోపాటు జీవనశైలిలో వచ్చిన మార్పులు అందుకు కారణమని తెలుస్తోంది. తాజా విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఉన్నతాధికారికి అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి.. ఒక్కసారిగా కుప్పు కూలిపోయి.. మరణించాడు. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) ఆదివారం విధుల్లో భాగంగా స్థానిక తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌కు వెళ్లాడు.


ఎస్కలేటర్ వైపు వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. చనిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న సహచర పోలీసులు వెంటనే స్పందించి.. సహాయం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోలీస్ సిబ్బందిపై అధిక ఒత్తిడి, వారి ఆరోగ్య పరిస్థితులు, విధుల్లో ఎదురయ్యే ప్రమాదాలను ఈ ఘటన ప్రభావితం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.


అయితే ఏ క్షణంలో ఎప్పుడు గుండెపోటుకు గురవుతామో ఎవరూ చెప్పలేరు. అందుకే ఆరోగ్యం, ఒత్తిడి లేకుండా జీవించేందుకు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. తీసుకునే అహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే.. ఇటువంటి ఆకస్మిక అనారోగ్య ప్రమాదాల నుంచి సులువుగా బయటపడ వచ్చు. లేకుంటే ఈ తరహా సమస్యలు ఎదురవుతాయి. గుండె పోటు భారిన పడకుండా ఉండాలంటే.. కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


భారీ వర్కౌట్స చేయకుండా.. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే మంచిదని యోగా నిపుణులు చెబుతున్నారు. అంటే.. యోగాసనాలు, అనులోమ, విలోమ ప్రాణాయామం చేయవచ్చు. కాసేపు అలా బయటకు వెళ్లి వాకింగ్ చేసినా చాలని అంటున్నారు. అలాగే ఇష్టమైన సంగీతం వినాలి. ఇంట్లోని పూల మొక్కలకు నీళ్లు పట్టడం. గార్డెన్‌లో సరదాగా కాసేపు గడపటం ద్వారా ఒత్తిడి నుంచి బయట పడ వచ్చని పేర్కొంటున్నారు. ఈ తరహా మార్గాల ద్వారా గుండెపోటు మరణాలు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..

భయాందోళనలో ఐపీఎస్ భార్య.. సీఎంకు లేఖ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2025 | 04:44 PM