Share News

Mettu Sai: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. కాంగ్రెస్ నేత స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - May 27 , 2025 | 04:14 PM

తెలంగాణలో కేటీఆర్ శకుని పాత్ర పోషిస్తున్నారని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. కేటీఆర్ భాషలోనే ఆయనకు గట్టిగా సమాధానం చెబుతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు మెట్టు సాయి.

Mettu Sai: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. కాంగ్రెస్ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Mettu Sai Kumar

హైదరాబాద్: మాజీమంత్రి కేటీఆర్‌పై (KTR) తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటీఆర్ అజ్ఞాని అని విమర్శించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని పొదుపుగా మాట్లాడాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(మంగళవారం) గాంధీ భవన్‌లో మెట్టుసాయి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ గురించి పది నిమిషాల పాటు ఆలోచిస్తే.. మీ పార్టీలో ఆ నలుగురు తప్ప ఎవరూ ఉండరని హెచ్చరించారు మెట్టు సాయి కుమార్.


తెలంగాణలో కేటీఆర్ శకుని పాత్ర పోషిస్తున్నారని మెట్టు సాయి కుమార్ విమర్శించారు. కేటీఆర్ భాషలోనే ఆయనకు సమాధానం చెబుతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ మత్తులో తెలంగాణ భవన్‌లో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా అని తమ నేతలు చేసిన ఛాలెంజ్‌కి కేటీఆర్ భయపడిపోయారని సెటెర్లు గుప్పించారు. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ని విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణను పది సంవత్సరాల పాటు కొరివిదెయ్యంలాగా పీల్చుకొని తిన్నది మీరు కాదా అని ప్రశ్నించారు మెట్టు సాయి కుమార్.


కాంగ్రెస్ పార్టీ దెయ్యంలాంటిదని కేటీఆర్ అంటున్నారని.. ఆయన సోదరి కవిత దెయ్యం అనే పదం నీ గురించా, నీ మామ గురించా మీకే తెలియాలని అన్నారు మెట్టు సాయి కుమార్. దెయ్యం, శకుని అన్ని బీఆర్ఎస్‌‌లోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన అరాచకాలను ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కేసీఆర్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా గతంలో పనిచేశారని.. ఈ విషయం కేటీఆర్ తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ అధో పాతాళానికి పోయిందని విమర్శించారు. దివంగత నేత వైఎస్సార్‌ని ఆదర్శంగా తీసుకొని రేవంత్‌రెడ్డి స్వర్ణయుగం లాగా తెలంగాణను పాలిస్తున్నారని మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటన

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ తెలిపిన మంత్రి సీత‌క్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 27 , 2025 | 04:17 PM