Mahesh Kumar Goud: బీజేపీపై మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 09:55 PM
కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ కాదని.. దేశ్‌ముఖ్ అని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని ఆక్షేపించారు.
కరీంనగర్, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ (BJP) ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(ఆదివారం) కరీంనగర్‌లో మహేష్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లతోనే తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిచారని అనుమానం వ్యక్తం చేశారు మహేష్‌కుమార్‌గౌడ్.
కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ కాదని.. దేశ్‌ముఖ్ అని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని ఆక్షేపించారు. దేవుళ్ల పేరుతో తాము ఎప్పుడూ ఓట్లు అడగలేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు రాగానే.. బీజేపీకి దేవుళ్లు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. కులం, మతం లేకపోతే బీజేపీ గెలవదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News