Share News

Madhapur SOT Police ON Marijuana Seize: హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత.. వీటి విలువ ఎంతంటే..

ABN , Publish Date - Oct 07 , 2025 | 06:33 PM

భాగ్యనగరంలో పోలీసులు ఇవాళ(మంగళవారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లింగంపల్లిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 45 కేజీల గంజాయిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.

Madhapur SOT Police ON Marijuana Seize: హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత.. వీటి విలువ ఎంతంటే..
Madhapur SOT Police ON Marijuana Seize

హైదరాబాద్, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో పోలీసులు ఇవాళ(మంగళవారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లింగంపల్లిలో భారీగా గంజాయి (Marijuana)ని పట్టుకున్నారు. చందానగర్ (Lingampally) పోలీస్ స్టేషన్ పరిధిలో 45 కేజీల గంజాయి పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ట్రైన్‌లో విశాఖపట్నం (Visakhapatnam) నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కి గంజాయిని తరలిస్తోంది ఓ ముఠా.


పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు (Madhapur SOT Police) గంజాయిని పట్టుకున్నారు. సుమారు రూ. 24లక్షలు విలువ చేసే 45 కేజీల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పంగి వెంకట్‌‌తో పాటు దివ్య రాణి, బుల్కి అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 06:40 PM